Assam Floods: అసోంలో భారీ వర్షాలు, విరిగిపడిన కొండ చరియలు. ఆరుమంది మృత్యువాత

దీంతో ఈశాన్యంలోని జాతీయ రహదారి ధ్వంసమైంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి భారీగా వర్షాలు కురిశాయి. దీంతో వరద ఉధృత వల్ల పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

Assam Floods Pic Credit- ANI

ఎడతెగని భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈశాన్యంలోని జాతీయ రహదారి ధ్వంసమైంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి భారీగా వర్షాలు కురిశాయి. దీంతో వరద ఉధృత వల్ల పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. గోపాలపురలో కొండచరియలు విరిగిపడి గురువారం ఇద్దరు మైనర్లు మృత్యువాత పడ్డారు. గువహటిలో కురుస్తున్న వర్షాలకు నగరమంతా వరద నీటితో నిండిపోయింది. అనిల్‌ నగర్‌, నబిన్‌ నగర్‌, రాజ్‌గఢ్‌ లింక్‌ రోడ్‌, రుక్మిణిగావ్‌, హతిగావ్‌, కృష్ణా నగర్‌లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌,ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గంటున్నాయి.

ఈ నెల 14 నుండి గౌహతిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ లేదు. కరెంట్‌ పునరుద్ధరణకు అసోం పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ 24గంటలు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బరగాన్‌లో మంగళవారం మట్టిపెళ్లలు విరిగి నలుగురు మృతి చెందారు. గీతానగర్‌, సోనాపూర్‌, కాలాపహార్‌, నిజారపర్‌ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని అసోం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) అధికారి తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)