Rahul Gandhi Stage Collapse Video: రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం, బీహార్‌లో కృంగిపోయిన సభావేదిక, వీడియో ఇదిగో..
సోమవారంనాడు బీహార్ (Bihar)లో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే.. పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలోని పాలిగంజ్‌లో ఓ సభలో రాహుల్ గాంధీని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వేదిక పైకి తీసుకువెళ్తుండగా వేదికలోని ఒక భాగం కిందకు కృంగిపోయింది.
సోమవారంనాడు బీహార్ (Bihar)లో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే.. పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలోని పాలిగంజ్‌లో ఓ సభలో రాహుల్ గాంధీని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వేదిక పైకి తీసుకువెళ్తుండగా వేదికలోని ఒక భాగం కిందకు కృంగిపోయింది. షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, అతివేగం.. మృత్యుపాశం అంటూ సూచన
దీంతో బ్యాలెన్స్ కోసం రాహుల్ కొద్దిసేపు తడబడ్డారు. వెంటనే ఆ విషయం గ్రహించిన మిసాభారతి ఆయన చేయి పట్టు నిలదొక్కుకునేందుకు సహకరించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని రాహుల్ ఫరవాలేదంటూ వారించడం, ఆ వెంటనే రాహుల్ నవ్వుతూ వేదికపై నుంచి సభికులకు చేయి ఊపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాటలీపుత్ర లోక్‌సభ సీటు నుంచి మిసా భారతి పోటీ చేస్తున్నారు.
Here's Video