Bihar Boat Capsized: ముజఫర్‌పూర్ జిల్లాలో ఘోర విషాదం, బాగమతి నదిలో 34 మంది విద్యార్థులో వెళుతున్న పడవ బోల్తా, 20 మందిని రక్షించిన పోలీసులు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం
పాఠశాల విద్యార్థులతో బాగమతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది.పడవలో 34 మంది విద్యార్థులు ఉన్నారు.సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులతో బాగమతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది.పడవలో 34 మంది విద్యార్థులు ఉన్నారు.సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు. మరో పద్నాలుగు మంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బెనియాబాద్ ప్రాంతంలోని పట్టి ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..వెంటనే సహాయక చర్యలు కొనసాగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకుని విలపిస్తున్నారు. అటు.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)