Videocon Chairman Venugopal Dhoot Arrested: వీడియో కాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ను అరెస్ట్ చేసిన సీబీఐ, బ్యాంకు రుణం ఎగ్గొట్టిన కేసులో విచారణ వేగవంతం..
ఈ కేసులో వీడియోకాన్ యజమాని వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
బ్యాంకు రుణాల మోసం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో వీడియోకాన్ యజమాని వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ గతంలో అరెస్టు చేసింది. చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్‌కి హెడ్‌గా ఉన్నప్పుడు వీడియోకాన్ గ్రూప్‌నకు రుణం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిగా చందా భర్త దీపక్ కొచ్చర్ కంపెనీ ను రెన్యూవబుల్ వీడియోకాన్ నుంచి పెట్టుబడి పొందింది. వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె దీపక్ కొచ్చర్‌లను సీబీఐ గత వారం అరెస్టు చేసింది. అనంతరం ముంబైలోని ప్రత్యేక కోర్టు వారిద్దరినీ మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)