Six Airbags Rule: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాల్సిందే, వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపిన కేంద్రం
ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఓ కీలక ట్వీట్ చేశారు.
ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలన్న నియమాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఓ కీలక ట్వీట్ చేశారు. ఎం-1 క్యాటగిరీలో కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే. ఎంత ఖరీదైన కార్లు అయినా లేక వేరియంట్లు అయినా.. ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు.