Congress Protest: బారీకేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లిన ప్రియాంకా గాంధీ, అదుపులోకి తీసుకున్న పోలీసులు

ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు.

Priyanka-Gandhi-Detained

ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు. ఈలోపు నిరసనలకు దిగిన రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆందోళ‌న‌ల్లో భాగంగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. కాంగ్రెస్ నిర‌స‌న‌ల్లో భాగంగా పార్టీకి చెందిన అంద‌రు నేత‌ల మాదిరే న‌లుపు రంగు దుస్తులేసుకుని రోడ్డు మీద‌కు వ‌చ్చిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ శ్రేణుల‌ను ముందుండి న‌డిపించారు. ఈ సంద‌ర్భంగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్‌ లను ఏర్పాటు చేశారు. అడుగు ముందుకేయ‌డానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన‌ బారికేడ్‌ను సైతం లెక్క‌చేయ‌ని ప్రియాంక‌... అవ‌లీల‌గా బారికేడ్‌ను ఎక్కి దానిపై నుంచి దూకారు. కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement