COVID Vaccination Update: కరోనా వ్యాక్సికేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన, సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ నిర్ణయం, 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గింపు
కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డోసుల మధ్య గ్యాప్‌ను ఆరు నెలలకు తగ్గించింది.
దేశంలో ఫోర్త్ వేవ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డోసుల మధ్య గ్యాప్‌ను ఆరు నెలలకు తగ్గించింది. సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధిని తగ్గించాలని వ్యాక్సినేషన్‌పై సలహా మండలి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం సెకండ్ డోస్‌కు, బూస్టర్ డోస్‌కు మధ్య 9 నెలల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను తాజాగా 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 18-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు.. సెకండ్ డోస్ తీసుకున్న ఆరు నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, నిర్వాహకులకు లేఖ ద్వారా తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)