Daaku Maharaaj: డాకు మహారాజ్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది, డేగ డేగ అంటూ దుమ్మురేపుతున్న బాలయ్య సాంగ్, వీడియో ఇదిగో..
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. డాకుస్ రేజ్ పేరుతో ఈ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. 'డేగ డేగ' అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. డాకుస్ రేజ్ పేరుతో ఈ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. 'డేగ డేగ' అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. తమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా ఈ పాటను నాకాశ్ అజీజ్ అలపించారు. ఇక మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Daakus Rage Lyric Video Promo from Daaku Maharaaj Out
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)