Declare a National Health Emergency: దేశంలో జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, ఎన్నికల ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు.
కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికల ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘కొవిడ్-19 కొత్త కేసులు కోలుకున్న వారి కన్నా వేగంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మోదీజీ.. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించండి. ఎన్నికల సంఘం.. ప్రచార ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించాలి. కోర్టులు ప్రజల ప్రాణాలను రక్షించాలి’ అని కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు.
Here's Kapil sibal tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)