Light Combat Helicopters: ఇండియన్ ఎయిర్‌పోర్స్‌లోకి తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, నేడు వాయుసేనలో ప్రవేశపెట్టనున్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వేదికగా ఇవి ఇండియన్ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లను నేడు రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరిలు నేడు లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వేదికగా ఇవి ఇండియన్ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎగురగల తేలికపాటి హెలికాప్టర్లు ఇవి. రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు. శత్రు రాడార్లను బోల్తాకొట్టించే స్టెల్త్ సామర్థ్యం వీటికి ఉన్నది. నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్ గేరును వీటికి అమర్చారు. 5 వేల మీటర్ల ఎత్తులో కూడా ఇవి టేకాఫ్ కాగలవు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)