Delhi CM Atishi Resign: ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అతిశీ..లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా సమర్పణ

ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు అతిశీ( Delhi CM Atishi Resign). అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఓడిపోవడంతో తన రాజీనామా లేఖను ఆమె ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు.

Delhi Chief Minister Atishi meets Lt Governor VK Saxena, submits resignation today

ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు అతిశీ( Delhi CM Atishi Resign). అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఓడిపోవడంతో తన రాజీనామా లేఖను ఆమె ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆమె ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Assembly Elections) బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా ఆప్ 22 చోట్ల గెలుపొందింది. ఇక కాంగ్రెస్ వరుసగా మూడో ఎన్నికల్లో ఖాతాను తెరవలేకపోయింది.

ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే? 

ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి సారి బీజేపీ విజయం సాధించగా ఆ తర్వాత 1998లో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ మొదటిసారి గెలిచింది. ఆ తర్వాత 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఆ తర్వాత 2013 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు పడిపోయింది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించగా తాజాగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది.

  Delhi Chief Minister Atishi  meets Lt Governor VK Saxena

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now