Spicejet: గత 18 రోజుల్లో 8 సార్లు విమానంలో సాంకేతిక లోపాలు, స్పైస్‌జెట్‌ సంస్థకు దిమ్మతిరిగే షాకిచ్చిన DGCA, లోపాల ఘటనలపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశాలు

స్పైస్‌జెట్‌ సంస్థకు DGCA దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్‌లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో స్పైస్‌జెట్‌ సంస్థకు పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్‌ సంస్థకు బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

SpiceJet aircraft. Representational image. (Photo Credits: File)

స్పైస్‌జెట్‌ సంస్థకు DGCA దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్‌లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో స్పైస్‌జెట్‌ సంస్థకు పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్‌ సంస్థకు బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. ఈ లోపాల ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ.

జూన్‌ 19న రెండు ఘటనలు, జూన్‌ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్‌ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత మూడేళ్లుగా ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ స్పైస్‌జెట్‌.. నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు.. వరుసగా నష్టాలు చవిచూసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement