Earthquake: బంగ్లాదేశ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం, కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లో భారీ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

బంగ్లాదేశ్‌లో సంభవించిన భూకంప ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌ ఈ ఉదయం కంపించిపోయింది. ఉదయం 10:08 గంటలకు వచ్చిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం నర్సింగ్ది ప్రాంతానికి సమీపంగా, భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Earthquake (Credits: X)

బంగ్లాదేశ్‌లో సంభవించిన భూకంప ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌ ఈ ఉదయం కంపించిపోయింది. ఉదయం 10:08 గంటలకు వచ్చిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం నర్సింగ్ది ప్రాంతానికి సమీపంగా, భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోల్‌కతాతో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. 30 సెకన్లకు పైగా ప్రకంపనలు కొనసాగినట్లు పలువురు తెలిపారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టం ఏదీ జరగలేదని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement