Farmers Protest: ఢిల్లీలో రైతుల నిరసనలో విషాదం, గుండెపోటుతో జ్ఞాన్ సింగ్ అనే రైతు మృతి, శంభు సరిహద్దులో జరిగిన నిరసనలో పాల్గొన్న తరువాత ఛాతి నొప్పితో విలవిల

కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య విషాదకర ఘటన చోటు చేసుకుంది. అంబాలాలోని శంభు సరిహద్దులో జ్ఞాన్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. నిరసనలో పాల్గొన్న రైతు గుండెపోటుతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Representative image. (Photo Credits: Unsplash)

కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య విషాదకర ఘటన చోటు చేసుకుంది. అంబాలాలోని శంభు సరిహద్దులో జ్ఞాన్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. నిరసనలో పాల్గొన్న రైతు గుండెపోటుతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జ్ఞాన్ సింగ్ అంబాలాలోని శంభు సరిహద్దులో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన భౌతికకాయాన్ని నేడు శంభు సరిహద్దుకు తీసుకురానున్నారు, అక్కడ రైతులు నివాళులర్పిస్తారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement