Go First Airlines: నడిపేందుకు డబ్బులు లేక రెండు రోజుల పాటు విమాన సేవలను రద్దు చేసిన గోఫస్ట్ ఎయిర్‌లైన్స్, దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు
ఈ కారణంగా రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తీవ్రమైన నిధుల కొరత కారణంగా (బుధవారం, గురువారం (మే 3, 4 తేదీలు) విమానాలను రద్దు చేస్తున్నట్లు గోఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనాను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది
వాడియా గ్రూప్ యాజమాన్యంలోని విమానాయాన సంస్థ గోఫస్ట్ ఫండ్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ కారణంగా రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తీవ్రమైన నిధుల కొరత కారణంగా (బుధవారం, గురువారం (మే 3, 4 తేదీలు) విమానాలను రద్దు చేస్తున్నట్లు గోఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనాను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. అంతేకాదు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసింది.ప్రాట్ అండ్ విట్నీ (P&W) ఇంజిన్‌లను సరఫరా చేయకపోవడంతో 28 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖోనా పీటీఐకి చెప్పారు.
Here's ANI Tweet