Gujarat Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, 160 కిలోమీటర్ల స్పీడుతో కారు డ్రైవ్, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మృతి, లైవ్‌లో చూపిస్తూ మరీ..
ఈ యువకులు వందకు పైగా వేగంతో కారు (Driving At 160 kmph) వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో చూపించారు. డ్రైవర్ కారు వేగంగా నడపడాన్ని కారులో ఉన్నవారు కూడా ఎంకరేజ్ చేశారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవ్ చేసిన వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు.
గుజరాత్ రాష్ట్రంలోని వాసద్ జిల్లాలో నలుగురు యువకులు కారు స్పీడ్ వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయారు. ఈ యువకులు వందకు పైగా వేగంతో కారు (Driving At 160 kmph) వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో చూపించారు. డ్రైవర్ కారు వేగంగా నడపడాన్ని కారులో ఉన్నవారు కూడా ఎంకరేజ్ చేశారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవ్ చేసిన వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. షాకింగ్ వీడియో ఇదిగో, వృద్ధుడిని అక్కడ ముద్దు పెట్టుకుంటూ 9 సార్లు కత్తితో పొడిచి చంపిన ట్రాన్స్‌జెండర్, ముందుగా కారుతో గుద్ది..
మే 2న అర్ధరాత్రి తర్వాత 22 నుంచి 27 ఏళ్ల వయస్సున్న ఐదుగురు స్నేహితులు అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై కారు 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చూపించి కేరింతలు కొట్టారు.అయితే ఒక వాహనాన్ని క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆ కారు ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదుగురు స్నేహితుల్లో నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు.డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు ప్రమాదంలో నలుగురి మృతికి ముందు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)