Arvind Kejriwal on India Name Change: ఇండియా పేరు భారత్‌గా మార్చే అంశంపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి భారత్ అని పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా అంటూ ప్రశ్న

విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళన చెందుతోందని అన్నారు. ఇప్పుడు అదే కూటమి ‘భారత్‌’ అని పేరు పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా..? అని పశ్నించారు.

Delhi CM arvind Kejriwal (Photo-ANI)

ఇండియా (India) పేరును భారత్‌ (Bharat)గా మారుస్తారన్న అంశంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పందించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళన చెందుతోందని అన్నారు. ఇప్పుడు అదే కూటమి ‘భారత్‌’ అని పేరు పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా..? అని పశ్నించారు. కొన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడటం వల్లే ఇలా జరుగుతోంది. ఒకవేళ ఇండియా కూటమి తన పేరును భారత్‌గా మార్చుకుంటే అప్పుడు భారత్‌ పేరును బీజేపీ అని మార్చేస్తారా..? ఈ దేశం ఒక్క పార్టీదే కాదు. 140 కోట్ల మంది ప్రజలది’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

Delhi CM Arvind Kejriwal (PIC @ ANI twitter)