IND vs ZIM: రెండో టీ-20లో జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం.. 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్.. 100 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా..

నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీన్ని ఛేదించిన జింబాబ్వే జట్టు పేకమేడలా కుప్పకూలింది.

IND vs ZIM 2nd T20I:  నిన్నటి ఓటమి తర్వాత ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో భారత జట్టు పునరాగమనం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీన్ని ఛేదించిన జింబాబ్వే జట్టు పేకమేడలా కుప్పకూలింది. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. గెలవాలంటే జింబాబ్వే 235 పరుగులు చేయాల్సి ఉంది. కానీ జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)