India Coronavirus: దేశంలో తాజాగా 62,714 మందికి కరోనా నిర్ధారణ, 312 మంది కరోనా కారణంగా మృతి, మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి
దేశంలో గత 24 గంటల్లో 62,714 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 312 మంది కరోనా కారణంగా మృతి (Covid Deathsw) చెందగా మృతుల సంఖ్య 1,61,552కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,23,762 మంది కోలుకున్నారు. 4,86,310 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
దేశ వ్యాప్తంగా 6,02,69,782 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,09,50,842 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,81,289 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలుకానున్న నైట్ కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు వరకూ ఉండనుంది. మాస్క్ లేకుండా తిరిగితే రూ. 500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 1000, కర్ఫూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడితే రూ. 1000 జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 15వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.
Here's Covid Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)