కర్నూల్‌ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్‌ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్‌ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి. క్రమంగా అవి బస్సు మొత్తం వ్యాపించడంతో క్షణాల్లో బస్సు అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా మరో 21 మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో బస్సు భారీ మంటలతో ఎగసినట్లుగా కనిపిస్తోంది.

నిద్రలోనే తిరిగిరాని లోకాలకు.. కర్నూల్ బస్సు అగ్ని ప్రమాదంలో ఎన్నో విషాద కథలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి, 20 మంది సజీవదహనం, మరో 21 మందికి గాయాలు

Kurnool Bus Fire Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)