India vs Zimbabwe 1st T20 Match: జింబాబ్వే చేతిలో భారత్ ఘోర ఓటమి.. 102 పరుగులకు ఆలౌటైన టీం ఇండియా.. 13 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం
హరారేలో శనివారం భారత్-జింబాబ్వే మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లోనే భారత జట్టు ఓడిపోయింది. ఐపీఎల్ స్టార్ ప్లేయర్లతో సన్నద్ధమైన టీమ్ ఇండియా 116 పరుగులు కూడా చేయలేక 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.
హరారేలో శనివారం భారత్-జింబాబ్వే మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లోనే భారత జట్టు ఓడిపోయింది. ఐపీఎల్ స్టార్ ప్లేయర్లతో సన్నద్ధమైన టీమ్ ఇండియా 116 పరుగులు కూడా చేయలేక 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో T20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమ్ ఇండియా, మొదటి మ్యాచ్‌లో అవమానకరమైన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాట్స్‌మెన్ 102 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే లాంటి జట్టు చేతిలో ఓడి ప్రపంచ ఛాంపియన్స్ టీమ్ ఇండియా చిత్తు అయ్యింది. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా భారీ సంబరాలు జరిగాయి, అయితే జింబాబ్వే చేతిలో ఈ ఓటమి అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది.