Jammu and Kashmir: పూంచ్ జిల్లాలో అకస్మాత్తుగా పేలిన గ్రెనేడ్, ఆర్మీ కెప్టెన్‌తో పాటు జేసీఓ మృతి, నివాళి అర్పించిన ఆర్మీ అధికారులు

ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ ఆనంద్, జూనియర్ కమిషన్డ్‌ ఆఫీసర్‌ భగవాన్ సింగ్‌ మృతి చెందారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు.

Security Forces in Jammu and Kashmir. (Photo Credits: IANS | File)

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద గల మెంధార్‌ సెక్టార్‌లో అకస్మాత్తుగా గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ ఆనంద్, జూనియర్ కమిషన్డ్‌ ఆఫీసర్‌ భగవాన్ సింగ్‌ మృతి చెందారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు. గ్రెనేడ్‌ పేలిన సమయంలో ఇతర సైనికులతో కలిసి ఆర్మీ కెప్టెన్‌తో పాటు నాయబ్‌ సుబేదార్‌ (JCO) విధులు నిర్వహిస్తున్నారని ఢిపెన్స్‌ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని హెలికాప్టర్‌లో ఉధంపూర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తూ అత్యున్నత త్యాగం చేసిన అధికారులను జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌, వైట్‌ నైట్‌ కార్ప్స్‌కు చెందిన అన్ని ర్యాంకులు ఘన నివాళులర్పించాయి. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)