Jammu and Kashmir: వీడియో ఇదే, ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భారత సైన్యం, అక్రమంగా భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం
భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో (Uri sector) నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఈ ముగ్గురిపాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.
భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో (Uri sector) నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఈ ముగ్గురిపాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. గురువారం ఉదయం బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీ నిర్వహిస్తుండగా నియంత్రిణ రేఖ వెంబడి ముగ్గురు వ్యక్తులు తుఫాకులతో అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే భారత భూభాగంలోకి చొరబడుతున్నారని గుర్తించిన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపింది.
దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు కశ్మీర్‌జోన్ పోలీసులు తెలిపారు.అనంతరం ఆ ప్రాంతంలో మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశామని, ఘటనా స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక చైనీస్ ఎం 16 తుపాకీ, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ వీడియోను ఇండియన్ ఆర్మీ తాజాగా విడుదల చేసింది.
Watch Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)