Jammu and Kashmir Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి, ఆర్మీ వాహనంపై కాల్పులుతో విరుచుకుపడిన టెర్రరిస్టులు, వీడియో ఇదిగో..
జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఆర్మీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. అఖ్నూర్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆర్మీ వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని ఆర్మీ మట్టుబెట్టినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా జమ్ము ప్రాంతంలో విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు జరుగుతోన్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.లోయలో గత వారంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు సహా కనీసం 12 మంది మరణించారు. అక్టోబర్ 24న, బారాముల్లాలోని గుల్‌మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)