Jammu and Kashmir Terror Attack: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి, అమరులైన ముగ్గురు జవాన్లు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది.ఈ దాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Security-Forces-in-Jammu-and-Kashmir

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది.ఈ దాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్‌పై మెరుపుదాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకస్మిక దాడి జరిగిన ప్రాంతానికి ఆర్మీ బలగాలను తరలించారు.ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.

గత నెలలో రాజౌరీలోని కలాకోట్‌లో సైన్యం ప్రత్యేక బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో సహా సైనికులు మరణించారు.ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మందికి పైగా సైనికులు మరణించారు.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement