Jammu and Kashmir: పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం, ఆ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్‌

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా (Pulwama) జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. గండిపొరాలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సోమవారం సాయంత్రం గాలింపు ప్రారంభించారు.

Representational Image (Photo Credits: PTI)

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా (Pulwama) జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గండిపొరాలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సోమవారం సాయంత్రం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఓ ఉగ్రవాది మరణించాడని, మరో ఉగ్రవాది దాక్కున్నాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వారిని జైషే మహమ్మద్‌ (JEM) ఉగ్రవాదులు గుర్తించామన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement