Japan PM Attacked With Bomb: జపాన్ ప్రధానిపై బాంబు దాడి, ఫుమియో కిషిదా కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు.
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు. మరికొద్ది సేపట్లో ఓ కార్యక్రమ వేదిక పై ప్రధాని మాట్లాడాల్సి ఉండగా.. వేదికకు సమీపంలో బాంబు పేలింది. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా ప్రసంగిస్తున్నప్పుడు పొగ బాంబు విసరడం ద్వారా ఆయనపై ఈ దాడి జరిగింది. నివేదికల ప్రకారం ప్రధానిని సురక్షితంగా తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు శబ్ధం వినిపించిన వెంటనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దుతూ పీఎం కిషిదాను ఘటనా స్థలం నుంచి సురక్షితంగా తరలించారు..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)