Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, పోలీస్ కానిస్టేబుల్‌ను లారీతో తొక్కి చంపిన ఇసుక మాఫియా, సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన మంత్రి ప్రియాంక్ ఖర్గే
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్‌ను లారీతో తొక్కి చంపారు.51 ఏళ్ల మైసూర్ చౌహాన్, నేలగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
Police Head Constable Crushed to Death: కర్ణాటకలో కలబురగి జిల్లాలో ఇసుక మాఫియా (sand mafia) మరోసారి రెచ్చపోయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్‌ను లారీతో తొక్కి చంపారు.51 ఏళ్ల మైసూర్ చౌహాన్, నేలగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం జేవర్గి పరిధిలోని నారాయణపుర గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆ పోలీస్ ప్రయత్నించాడు. అయితే లారీని నిలుపని డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్ చౌహాన్ మీదుగా వాహనాన్ని నడిపాడు.
దీంతో బైక్‌తో సహా లారీ టైర్ కింద పడిన ఆ పోలీస్ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇసుక లారీ డ్రైవర్ సిద్ధన్నను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సీరియస్‌గా స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ చౌహాన్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)