Kashmiri Pandit Shot Dead: క‌శ్మీరీ పండిట్ ఉద్యోగి హత్య, నిరసనకారులపై టియ‌ర్ గ్యాస్‌, ర‌బ్బ‌ర్ బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు, రక్షణ కల్పించాలని కోరిన క‌శ్మీరీ పండిట్లు

క‌శ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భ‌ట్ హ‌త్య‌ను నిర‌సిస్తూ, ఆయ‌న కుటుంబీకులు, ప్ర‌భుత్వ అధికారులు, క‌శ్మీరీ పండిట్లు జ‌మ్మూ క‌శ్మీర్‌లోని బుడ్గామ్ ప్రాంతంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఎల్జీ మ‌నోజ్ సిన్హాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌యంలో నిర‌స‌న కారుల‌పై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

Rahul Bhat, the government employee who died in terror attack

క‌శ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భ‌ట్ హ‌త్య‌ను నిర‌సిస్తూ, ఆయ‌న కుటుంబీకులు, ప్ర‌భుత్వ అధికారులు, క‌శ్మీరీ పండిట్లు జ‌మ్మూ క‌శ్మీర్‌లోని బుడ్గామ్ ప్రాంతంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఎల్జీ మ‌నోజ్ సిన్హాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌యంలో నిర‌స‌న కారుల‌పై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. టియ‌ర్ గ్యాస్‌, ర‌బ్బ‌ర్ బుల్లెట్లు కూడా ప్ర‌యోగించారు. దీంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. ఆందోళ‌న‌క‌రంగా మారిపోయింది. త‌మ‌కు ఎల్జీ మ‌నోజ్ సిన్హా వెంట‌నే ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, లేదంటే సామూహిక రాజీనామాలు చేస్తామ‌ని అమిత్ అనే క‌శ్మీరీ పండిట్ తీవ్రంగా హెచ్చ‌రించారు.

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్‌ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్‌ పండిట్‌ ఉద్యోగిని కాల్చి (Kashmiri Pandit Shot Dead) చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. ఆ తర్వాత పలువురు ఉద్యోగులు రాహుల్‌ భట్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాహుల్‌ భట్‌ను శ్రీనగర్‌కు రెఫర్‌ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement