Modi Surname Remark: దొంగలందరికీ మోదీ ఇంటిపేరు దుమారం, రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో దావా వేస్తానని లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందంటూ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు.
దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందంటూ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. మోదీ ఇంటి పేరిట రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటన్ కోర్టుకు అతడ్ని లాగుతానని లలిత్ మోదీ ప్రకటించారు. ట్విట్టర్ లో లలిత్ మోదీ వరుస ట్వీట్లు చేశారు. కాగా ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా అర్హత కోల్పోయారు.
గాంధీ సహచరులు నేను న్యాయవ్యవస్థ విచారణ నుంచి పారిపోయిన వాడినని పదే పదే అంటున్నారు. నేనేమీ దోషిగా ప్రకటించబడలేదు. కనుక సాధారణ పౌరుడినే. ప్రతిపక్ష నాయకులకు వేరే ఏ పనీ లేదు కనుక వారు తప్పుడు ప్రచారం లేదా ప్రతీకారాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీపై యూకే కోర్టులో పోరాడాలని నిర్ణయించుకున్నాను. అతడు కొన్ని ఆధారాలతో వస్తాడని నమ్ముతున్నాను. అతడ్ని పూర్తి మూర్ఖుడిగా నిరూపించేందుకు నేను ఎదురు చూస్తున్నాను’’ అని లలిత్ మోదీ ప్రకటించారు.
Here's Lalit Kumar Modi Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)