Lalu Advice to Rahul Gandhi on Marriage: వీడియో ఇదిగో, రాహుల్ వెంటనే పెళ్లి చేసుకో, కనీసం మా మాటైన విను, యువనేతకు లాలూ ప్రసాద్ యాదవ్ సలహా

బీహార్‌ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌..రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం’ అని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.

Lalu Advice to Rahul Gandhi on Marriage (photo-ANI)

బీహార్‌ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌..రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం’ అని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. 53 ఏళ్ల రాహుల్‌ గాంధీ నవ్వుతూ దీనికి బదులిచ్చారు. ‘ఇప్పుడు మీరు దాని (పెళ్లి) గురించి చెప్పారు. ఇక అది జరుగుతుంది’ అని అన్నారు.

‘ఇంకా ఆలస్యం ఉందా? తన మాట వినడం లేదని మీ అమ్మగారు నాతో చెప్పారు’ అని లాలూ వ్యాఖ్యానించారు. ‘మా మాట విను.. పెళ్లి గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వు’ అని అన్నారు. పెళ్లి చేసుకోవాలని గతంలో తాను ఇచ్చిన సలహాను రాహుల్‌ గాంధీ పాటించలేదని లాలూ తెలిపారు. తన సలహా పాటించి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండేవారని అన్నారు. పెళ్లిని ఇంకా ఆలస్యం చేయవద్దని రాహుల్‌ గాంధీకి సూచించారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొన్న నేతలంతా నవ్వుకున్నారు.

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement