Lok Sabha Election 2024: జార్ఖండ్ మంత్రి పీఏ ఇంట్లో రూ. 25 కోట్ల లెక్క చూపని నగదు, రాంచీలో 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించిన ఈడీ
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది.
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇవాళ రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్టుబడిన నగదు విలువ సుమారు రూ.25కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నువ్వు చీరకట్టుకుంటావా? రాహుల్ గాంధీకి చీర కట్టిస్తావా? మహిళలకు రూ. 2500 ఇస్తున్నామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)