Parliament Winter Session 2023: సీఈసీ, ఈసీల బిల్లుకు పార్లమెంటు ఆమోదం, సెర్చ్‌, ఎంపిక కమిటీలదే ఇకపై నియామక బాధ్యత

‘ది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు- 2023’ను గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ (Lok Sabha) ఆమోదించింది.

Lok Sabha Security Breach

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటు (Parliament)లో ఆమోదం లభించింది. ‘ది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు- 2023’ను గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ (Lok Sabha) ఆమోదించింది.

కొత్త బిల్లు ప్రకారం.. సెర్చ్‌, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి. గతంలో సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవని పేర్కొంటూ.. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. ప్రస్తుతమున్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)