Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

45-Year-Old Man on Parole Shot Dead in Gwalior

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో ప్రకారం..సోని సర్దార్ అని పిలువబడే జస్వంత్ సింగ్ (45) 2016లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అక్టోబర్ 28న 15 రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత రోడ్డుపైకి వచ్చి స్థానికులతో సంభాషిస్తున్నాడు.

వీడియో ఇదిగో, పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి, 8 మంది ప్రాణాలతో బయటకు, ఛత్ పూజ సందర్భంగా విషాదకర ఘటన

ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. దాంతో జశ్వంత్‌ సింగ్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సింగ్‌ను గ్వాలియర్‌లోని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

45-Year-Old Man on Parole Shot Dead in Gwalior

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)