Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో 12వ సారి భారీ భూకంపం, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు
సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కాగా, జూన్ తర్వాత దోడా జిల్లాలో భూకంపం రావడం ఇది 12వ సారి. జూన్ 13న 5.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇండ్లు, భవనాలు బీటలువారాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)