Mumbai: షాకింగ్ వీడియో, అందరూ చూస్తుండగానే బస్సు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు, సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు
వేగంగా వెళ్తున్న ఓ బస్సు వెనుకాల టైర్ల కింద తల పెట్టి తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
మహారాష్ట్ర రాజధాని అంధేరి వెస్ట్‌లో ఓ వృద్ధుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న ఓ బస్సు వెనుకాల టైర్ల కింద తల పెట్టి తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని అబ్దుల్ గఫార్ ఇస్మాయిల్ సయీద్(59)గా గుర్తించారు. మృతుడి వివరాలను సేకరించిన అనంతరం ఆ డెడ్‌బాడీని అతని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అయితే వృద్దుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు.
Here's Disturbing Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)