Monsoon Session: రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ సవరణ బిల్లు 2023కి లోక్‌సభ ఆమోదం

పార్లమెంట్ సమావేశాలు తొమ్మిదివ రోజు జరుగుతున్నాయి. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ సవరణ బిల్లు, 2023’ లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఛత్తీస్‌గఢ్‌కు వర్తించే రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఆర్డర్, 1950ని సవరిస్తుంది.

Parliament Monsoon Session (Photo-ANI)

పార్లమెంట్ సమావేశాలు తొమ్మిదివ రోజు జరుగుతున్నాయి. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ సవరణ బిల్లు, 2023’ లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఛత్తీస్‌గఢ్‌కు వర్తించే రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఆర్డర్, 1950ని సవరిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడే కులాలు, తెగలను ఆర్డర్ జాబితా చేస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని మెహ్రా, మహర్, మెహర్ కమ్యూనిటీలకు పర్యాయపదాలుగా మహారా మహరా కమ్యూనిటీలను బిల్లు చేర్చింది.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ తేదీలు ఖరారు చేశారు. ఈనెల 8.9,10 తేదీల్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ప్రధాన మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఇక సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు వచ్చింది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. అలాగే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆర్‌ఎస్‌పీ సైతం ప్రకటించింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now