Monsoon Session 2023: ఉభయ సభలు నిరవధిక వాయిదా, 22 బిల్లులకు లోక్ సభ ఆమోదం, అవిశ్వాస తీర్మానాన్ని రెండు సార్లు ఎదుర్కున్న ప్రధాని మోదీ

జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని స్పీకర్ ఓం బిర్లా వివరించారు.

Lok Sabha Speaker Birla (Photo-ANI)

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon session) భాగంగా ఉభయ సభలు (Loksabha) శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని స్పీకర్ ఓం బిర్లా వివరించారు. 22 బిల్లులను సభ ఆమోదించినట్టు చెప్పారు. సభాకార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అన్ని పార్టీల నేతలు, ఎంపీలకు ఓం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు.

సభా కార్యక్రమాల్లో భాగంగా జూలై 26న కేంద్రంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు ప్రవేశపెట్టగా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. దీనిపై మూడు రోజుల పాటు చర్చ జరిగింది. 60 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.తీర్మానంలో భాగంగా మణిపూర్ హింసతో సహా పలు అంశాలపై అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలతో సభను హోరెత్తించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక క్యాటగిరి హోదా కల్పించే విషయమై మోదీ ప్రభుత్వంపై తొలిసారి 2018లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, ఆ తీర్మానం వీగిపోయింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)