Mumbai Airport Bomb Threat: ముంబయి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్, ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలని అగంతకులు డిమాండ్

మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఒక మిలియన్ డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించకపోతే విమానాశ్రయంలోని టర్మినల్-2 పేల్చేస్తామని ఆగంతుకులు బెదిరించారు

Mumbai Airport Bomb Threat

మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఒక మిలియన్ డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించకపోతే విమానాశ్రయంలోని టర్మినల్-2 పేల్చేస్తామని ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు ఫీడ్‌బ్యాక్‌కు గురువారం మెయిల్ పంపించారు. 24 గంటల తరువాత మరో మెయిల్ పంపిస్తామని కూడా నిందితులు తెలిపారు. దీంతో, విమానాశ్రయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లు ఇవ్వకపోతే అంబానీని హత్యచేస్తానంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆ తరువాత రూ.200 కోట్లు , రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement