Mumbai: రూ. 7 లక్షలు పొరపాటున వేరే అకౌంట్లోకి, లబోదిబో మంటూ బాధితురాలు బ్యాంకును సంప్రదిస్తే మాకు తెలియదనేశారు, పోలీసుల రంగ ప్రవేశంతో ఎట్టకేలకు తిరిగి వచ్చిన డబ్బులు
ముంబై మీరా రోడ్డుకు చెందిన 38 ఏళ్ల గృహిణి పొరపాటున ఒక ఖాతాలొ కాకుండా మరో ఖాతాలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ద్వారా రూ. 7 లక్షలు చేసింది. అయితే పొరపాటు తెలుసుకునే లోపే జరగాల్సింది జరిగిపోయింది. వెంటనే బ్యాంకుకు వెళ్లగా వారు మాకు సంబంధం లేదని తేల్చేశారు
ముంబై మీరా రోడ్డుకు చెందిన 38 ఏళ్ల గృహిణి పొరపాటున ఒక ఖాతాలొ కాకుండా మరో ఖాతాలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ద్వారా రూ. 7 లక్షలు చేసింది. అయితే పొరపాటు తెలుసుకునే లోపే జరగాల్సింది జరిగిపోయింది. వెంటనే బ్యాంకుకు వెళ్లగా వారు మాకు సంబంధం లేదని తేల్చేశారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుజిత్‌కుమార్ గుంజ్కర్ మరియు PSI ప్రసాద్ షెనోల్కర్ నేతృత్వంలోని సైబర్ క్రైమ్ సెల్ బృందం వెంటనే రెండు బ్యాంకుల యాజమాన్యంతో చర్చలు జరిపింది.
రూ. 7 లక్షలు పొందిన వ్యక్తి ఆ మొత్తం తనకు లాటరీ ద్వారా తగిలిందని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. పోలీసులు ఆధారాలు చూపమని చెప్పడంతో అతడు దాన్ని నిరూపించలేకపోయాడు.అనంతరం పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఆ మొత్తాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని సైబర్ క్రైం పోలీసులు ట్వీట్ చేశారు.