Thaman Responds to Chiranjeevi's Praise: మీ మాట‌లు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తు చేస్తున్నాయి, చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఎస్ త‌మ‌న్

అన్న‌య్యా.. మీ మాట‌లు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ త‌మ‌న్ ట్వీట్ చేశారు. "డియ‌ర్ అన్న‌య్యా.. మీ మాట‌లు నాకు క‌ర్మ‌ణ్యేవాధికార‌స్తే మా ఫ‌లేషు క‌దాచ‌న అన్న భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాద‌నుకున్నా మ‌నుషులం క‌దా.. ఒక్కోసారి ఆవేద‌న గుండె త‌లుపులు దాటి వ‌చ్చేస్తూ ఉంటుంది.

Thaman Responds to Chiranjeevi's Praise (Photo-Insta/Fb)

సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ త‌మ‌న్ తెలుగు సినిమా విష‌య‌మై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. మ‌న సినిమాల్ని మ‌న‌మే చంపేసుకుంటున్నామ‌ని అభిమానుల‌ను ఉద్దేశించి త‌మ‌న్ చేసిన వ్యాఖ్య‌లపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీ వ్యాఖ్యలు హృదయాల్ని తాకేలా ఉన్నాయని అన్నారు. చిరు ప్ర‌శంస‌ల‌పై త‌మ‌న్ ఎక్స్ వేదికగా స్పందించారు.

అన్న‌య్యా.. మీ మాట‌లు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ త‌మ‌న్ ట్వీట్ చేశారు. "డియ‌ర్ అన్న‌య్యా.. మీ మాట‌లు నాకు క‌ర్మ‌ణ్యేవాధికార‌స్తే మా ఫ‌లేషు క‌దాచ‌న అన్న భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాద‌నుకున్నా మ‌నుషులం క‌దా.. ఒక్కోసారి ఆవేద‌న గుండె త‌లుపులు దాటి వ‌చ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ‌ని, క‌ళ్లు తెరిచే లోప‌లే చిదిమేస్తుంటే వ‌చ్చిన బాధ అది. అర్థం చేసుకుని మీరు చెప్పిన మాట‌లు నాకు జీవితాంతం గుర్తుంటాయి" అని త‌మ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

ఇక శుక్ర‌వారం నాడు 'సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ స‌క్సెస్ మీట్‌లో త‌మ‌న్ తెలుగు సినిమా గురించి ఎంతో ఆవేద‌న‌తో చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆలోచింపచేస్తున్నాయి. విదేశాల్లో కూగా తెలుగు సినిమా గురించి మాట్లాడుతుంటే.. మ‌నం మాత్రం మ‌న సినిమాను త‌క్కువ చేసుకుంటున్నామంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Thaman Responds to Chiranjeevi's Praise: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now