Firing on Odisha Health Minister: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్‌ఐ, విషమంగా మంత్రి ఆరోగ్యం, కాల్పులకు గల కారణాలపై ఆరా

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్‌ దాస్‌పై (Nava kishore das) కాల్పులు జరిగాయి. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని (Shot At in Brajarajnagar) గాంధీచౌక్‌ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే మంత్రిపై అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కాల్పులకు పాల్పడ్డట్లు తెలెస్తోంది. బ్రజరాజునగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిగాయి.

Representational Image (File Photo)

Brajarajnagar,JAN 29: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్‌ దాస్‌పై (Nava kishore das) కాల్పులు జరిగాయి. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని (Shot At in Brajarajnagar) గాంధీచౌక్‌ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే మంత్రిపై అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కాల్పులకు పాల్పడ్డట్లు తెలెస్తోంది. బ్రజరాజునగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నవకిశోర్ దాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ ఏఎస్‌ఐని (ASI) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ ఘటనలో మంత్రితో పాటూ మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now