Nagpur Car Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, పుల్లుగా తాగి అడ్డదిడ్డంగా కారు నడపడంతో ఇద్దరు మృతి, మరో ముగ్గురి పరిస్థితి సీరియస్

మంగళవారం తెల్లవారుజామున నాగ్ పూర్ లో జరిగిన కారు ప్రమాదం వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న బారియర్ ను ఢీ కొట్టడం కనిపిస్తోంది.

Two people were killed after this speeding car hit a crash barrier in Maharashtra's Nagpur

Nagpur Car Accident Video:  మంగళవారం తెల్లవారుజామున నాగ్ పూర్ లో జరిగిన కారు ప్రమాదం వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న బారియర్ ను ఢీ కొట్టడం కనిపిస్తోంది. నాగ్ పూర్ లోని పంజారా గ్రామ సమీపంలో చోటుచేసుకుందీ ప్రమాదం. కారులోని యువకులంతా మద్యం మత్తులో ఉన్నారని, రీల్స్ కోసం కారును అతివేగంగా, అడ్డదిడ్డంగా నడిపారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడిందన్నారు.

బోల్తా పడిన చోటు నుంచి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకుపోయిందని చెప్పారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారిందన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందితో కలిసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి సీరియస్ గానే ఉందని వైద్యులు చెప్పారన్నారు.  తండ్రీ కొడుకుల సూసైడ్ వీడియో ఇదిగో, రైల్వే పట్టాల వైపు వెళ్ళి లోకల్ రైలు రాగానే దాని కింద దూకేసారు

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement