Andhra Pradesh: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటానంటూ యువ‌కుడి సెల్ఫీ వీడియోపై స్పందించిన న‌ర‌స‌రావుపేట డీఎస్పీ, ఏమన్నారంటే..

సెల్పీ వీడియోపై న‌ర‌సరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. మదార్ వలీ పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అత‌ణ్ణి నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు న‌గ‌దు అడ‌గ‌లేదు. త‌ప్పు త‌న‌దేన‌ని, భ‌య‌ప‌డి అలా చెప్పాన‌ని మదార్ వలీ విచార‌ణ‌లో ఒప్పుకున్నాడు.

Narasaraopet DSP Nageswara Rao reacted to the selfie video of the youth Who Try to Suicide on Railway Track

పోలీసులు రూ. 5 లక్షలు లంచం అడిగారని ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ యువకుడు విడుదల చేసిన సెల్పీ వీడియోపై న‌ర‌సరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. మదార్ వలీ పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అత‌ణ్ణి నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు న‌గ‌దు అడ‌గ‌లేదు. త‌ప్పు త‌న‌దేన‌ని, భ‌య‌ప‌డి అలా చెప్పాన‌ని మదార్ వలీ విచార‌ణ‌లో ఒప్పుకున్నాడు. అవాస్త‌వాల‌ను సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేసి.. పోలీసులపై దుష్ప్ర‌చారం చేయొద్దని తెలిపారు.

వీడియో ఇదిగో, తప్పుడు కేసులో ఇరికించి రూ. 5 లక్షలు లంచం డిమాండ్, రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానంటూ యువకుడు వీడియో

కాగా నరసరావుపేట రూరల్ సి.ఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ చేత తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని, కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లంచం గా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని అంత డబ్బు తన వద్ద లేదని ఇక తనకి చావే శరణ్యం అని భావించి రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానని మదార్ వలి వీడియోలో తెలియజేశాడు.

Narasaraopet DSP Nageswara Rao reacted to the selfie video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement