Modi Most Successful Indian PM: మోదీ భారత దేశ చరిత్రలో గ్రేటెస్ట్ ప్రధాని, ప్రశంసల వర్షం కురిపించిన ముఖేష్ అంబానీ, గుజరాతీగా గర్వపడుతున్నానని వెల్లడి

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశసంల వర్షం కురిపించారు. భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే అని కొనియాడారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్‌ సమ్మిట్‌’ లో ప్రధాని సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Billionaire Mukesh Ambani (Photo Credit: ANI)

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశసంల వర్షం కురిపించారు. భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే అని కొనియాడారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్‌ సమ్మిట్‌’ లో ప్రధాని సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీగానే కొనసాగుతుంది. రిలయన్స్ గత 10 సంవత్సరాలలో భారతదేశం అంతటా 12 లక్షల కోట్లు పెట్టుబడు పెట్టింది. అందులో 1/ 3వ వంతు ఒక్క గుజరాత్‌లోనే పెట్టుబడి పెట్టబడిందని తెలిపారు. నేను గుజరాతీగా గర్వపడుతున్నానని అన్నారు. 2047 నాటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు. గుజరాత్ 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’అని అంబానీ అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now