Neeraj Chopra 89.34 M Throw Video: నీరజ్‌ చోప్రా జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరిన వీడియో ఇదిగో, ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత స్టార్

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌ (గ్రూప్‌ బి)లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

Neeraj Chopra (Photo-X)

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌ (గ్రూప్‌ బి)లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.  చోప్రాతోపాటు తొలి ప్రయత్నంలోనే గ్రెనెడాకు చెందిన పీటర్స్‌ అండర్సన్‌ (88.63 మీ) రెండో స్థానంలో, పాకిస్థాన్‌కు నదీమ్ అర్షద్‌ (86.59 మీ) మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు.

ఆగస్టు 8న రాత్రి 11:55 గంటలకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. భారత్‌కు చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ కిశోర్‌ జెనా ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. గ్రూప్‌ ఎలో అతడు అత్యుత్తమంగా తొలి ప్రయత్నంలో 80.73 మీటర్ల ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 80.21 మీటర్లు విసిరాడు. మను బాకర్ హ్యాట్రిక్ మెడల్ మిస్, 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో నాలుగో స్థానం, రెండు కాంస్యాలతో బాకర్ రికార్డు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement