Nitin Gadkari Health Update: ఎండ వేడి కారణంగానే స్పృహ కోల్పోయాను, ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపిన గడ్కరీ

తన అధికారిక X హ్యాండిల్ ద్వారా హెల్త్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. “మహారాష్ట్రలోని పుసాద్‌లో ర్యాలీ సందర్భంగా వేడి కారణంగా నేను అసౌకర్యంగా భావించాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. తదుపరి సమావేశానికి హాజరు కావడానికి వరుద్‌కు బయలుదేరుతున్నాను. మీ ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Nitin Gadkari (photo-ANI)

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయిన సంగతి విదితమే.అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స అందదడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. మహాయుతి కూటమిలో భాగంగా నితిన్ గడ్కరీ శివసేన - సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన యవత్మాల్‌ లోక్‌సభ అభ్యర్ధి రాజశ్రీ పాటిల్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ ప్రసంగంలో గడ్కరీ స్పృహ కోల్పోవడంతో సిబ్బంది, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిత్స అందించే ప్రయత్నాలు చేశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తన అధికారిక X హ్యాండిల్ ద్వారా హెల్త్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. “మహారాష్ట్రలోని పుసాద్‌లో ర్యాలీ సందర్భంగా వేడి కారణంగా నేను అసౌకర్యంగా భావించాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. తదుపరి సమావేశానికి హాజరు కావడానికి వరుద్‌కు బయలుదేరుతున్నాను. మీ ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  మాట్లాడుతూనే స్పృహ కోల్పోయిన నితిన్‌ గడ్కరీ వీడియో ఇదిగో, సకాలంలో చికిత్స అందదడంతో కోలుకున్న కేంద్ర మంత్రి

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now