Kerala Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, కేరళలో మావటిని రెండు కాళ్ల మధ్యలో పెట్టుకుని తొక్కి చంపిన ఏనుగు, ప్రదర్శనలో అదుపు తప్పి ఒక్కసారిగా జనాల మీదకు..
తనను పెంచి, పోషించిన మావటినే ఏనుగు తొక్కి చంపేసిన ఘటన కేరళ(Kerala)లో చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. కేరళలో నిన్న రాత్రి మావటి కుంజుమన్(50) తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
తనను పెంచి, పోషించిన మావటినే ఏనుగు తొక్కి చంపేసిన ఘటన కేరళ(Kerala)లో చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. కేరళలో నిన్న రాత్రి మావటి కుంజుమన్(50) తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో అదుపు తప్పిన ఏనుగు ఒక్కసారిగా జనాలపై దాడి చేసింది. దానిని నియంత్రించేందుకు కుంజుమన్ ప్రయత్నించగా, అతడిపై ఏనుగు దాడికి దిగడంతో చనిపోయాడు.
అయితే, ఏనుగు ఎందుకు అలా ప్రవర్తించిందో ఒక్కసారిగా ఎవరికీ అర్థం కాలేదు. ఏనుగు దాడి చేసే సమయంలో చుట్టుపక్కల జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఏనుగుపై కూర్చున్న వారిని సైతం కింద పడేయాలని చూడగా, వారు బలంగా పట్టుకుని కూర్చుకున్నారు. దీంతో మావటిని ఏనుగు కిందపడేసి తన దంతాలతో కుమ్మేసి రెండే కాళ్ల మధ్యలో పెట్టుకుని తొక్కి చంపేసింది. ఈ విజువల్స్ చూసేందుకు సైతం చాలా భయంకరంగా ఉన్నాయి.
Elephant Runs Amok, Tramples Man to Death During Religious Performance in Kerala
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)