Parliament Winter Session 2023: డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, మొత్తం 15 రోజుల పాటు ఉభయసభల సమావేశాలు
డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. సెలవులు మినహా డిసెంబర్ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023 తేదీ వచ్చేసింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. సెలవులు మినహా డిసెంబర్ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు.
బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే.
వీటికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Here's Pralhad Joshi Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)