Pushpa 2: The Rule: పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో, మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం అంటూ అభిమానులు కొటేషన్
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో అల్లు అర్జున్‌తో పాటు జగన్ ఫొటో కూడా దర్శనం ఇచ్చింది. మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.
Photo of YS Jagan in Pushpa-2 Flexi
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)